Wednesday, 16 September 2026 01:48:08 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

క్రమశిక్షణ లేకుంటే చర్యలు తప్పవు : మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ హెచ్చరిక..

Date : 16 May 2026 10:22 AM Views : 79

DNB News - ఆంధ్రప్రదేశ్ / : నగరపాలక సంస్థలో పనిచేసే ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినా, క్రమశిక్షణ పాటించకపోయినా కఠిన చర్యలు తప్పవని కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. శుక్రవారం ఆయన 14వ శానిటేషన్ మస్టర్‌ను తనిఖీ చేసి అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. చెన్నమ్మ సర్కిల్, బళ్లారి చౌరస్తా, వాణిజ్య నగర్ ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్‌కు కొంతమంది సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపించింది. ఒక కార్మికుడు హాజరు వేసుకుని ఇంటికి వెళ్లగా, మరొకరు మొబైల్ ఫోన్‌లో కాలక్షేపం చేస్తూ కనిపించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు గైర్హాజరైన ఉద్యోగి జీతం కట్ చేయాలని ఆదేశించారు. విధి సమయంలో మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేయడం, హాజరు వేసుకుని ఇంటికి వెళ్లడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. పిన్ పాయింట్ ప్రోగ్రామ్‌ను కచ్చితంగా అమలు చేసి ప్రతి వీధి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నగర పారిశుద్ధ్యంపై రాజీ పడబోమని పేర్కొన్నారు. అనంతరం పరిమళ నగర్‌లోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన కమిషనర్ అక్కడి స్వచ్ఛత, తాగునీటి సరఫరా, భోజన నాణ్యత వంటి అంశాలను తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవల్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. నగరపాలక కార్యాలయంలో ప్రజలకు కల్పించనున్న వసతులను కూడా ఆయన పరిశీలించారు. తన ఆదేశాల మేరకు కార్యాలయంలో కుర్చీలు, వాటర్ కూలర్, హెల్ప్ డెస్క్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం కార్పొరేషన్ బాధ్యత అని పేర్కొన్నారు. అదేవిధంగా వెండర్ జోన్ల ఏర్పాటుకు వెంకటరమణ కాలనీలోని హరిత హోటల్ వెనుక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు మునిస్వామి, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: