DNB News - ఆంధ్రప్రదేశ్ / : మార్చి 8న జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసుల సంక్షేమమే ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. మహిళా సాధికారతలో ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని, మహిళలు శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండాలని పేర్కొన్నారు. పోలీసుల సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ శిబిరంలో ముఖ్యంగా మహిళా పోలీసు సిబ్బంది ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం 185 మందికి రక్తపోటు, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో, పీఎఫ్టీ, బీఎండీ వంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. వైద్యులు తగిన సూచనలు, సలహాలు అందించారు. అనంతరం వైద్యుల బృందాన్ని అభినందించి, శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ ఎం. మహేష్ కుమార్, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్రబాబు, హోంగార్డు డీఎస్పీ ప్రసాద్, పోలీసు వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు మంజునాథ్, రఘునందిని, సువర్ణ, సింధూర, స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసుధన్ రావు, మహిళా పీఎస్ సీఐ రామయ్యనాయుడు, ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్, ఆర్ఐలు జావేద్, నారాయణ, ఆర్ఎస్ఐలు, మహిళా పోలీసులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం, కర్నూలు.
Admin
DNB News