DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రేమ పేరుతో వేధించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి చనిపోతానని అక్కకు చెప్పి మరీ సూసైడ్ చేసుకుంది. ఉప్పల్ PS పరిధి ఇందిరానగరు చెందిన గండమళ్ల చందన (23) మేడిపల్లిలోని ఓ ఐ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఆమెకు బొమ్మలరామారానికి చెందిన తుడుము శివ(23)తో ఏడాదిన్నరగా పరిచయం ఉంది. తరచూ వేధించడంతో తట్టుకోలేకపోతున్నానని ఈ నెల 21న అక్కతో వాపోయింది. మరుసటి రోజు ఇంట్లో ఉరేసుకుంది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది..!!
Admin
DNB News