Friday, 18 September 2026 08:10:55 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఇంటర్ పాఠ్యపుస్తకాల లీక్‌పై విచారణ చేయాలి – బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి: ఏఐఎస్ఎఫ్ డిమాండ్..

Date : 26 March 2026 11:30 AM Views : 89

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల పీడీఎఫ్ లీక్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు, రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్ జీ డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలులోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇంటర్ పాఠ్యపుస్తకాల ముద్రణ బాధ్యతలు పొందిన వీజీఎస్, విక్రమ్, గైడ్ పబ్లిషర్స్ సంస్థలు పాఠ్యపుస్తకాల పీడీఎఫ్ కాపీలను లీక్ చేసి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు విక్రయించడం ద్వారా ప్రభుత్వాన్ని మోసం చేశాయని ఆరోపించారు. ఫిజిక్స్, గణితం సహా పలు సబ్జెక్టుల పుస్తకాలు వాట్సాప్ ద్వారా వ్యాప్తి చెందినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ.1200 కోట్ల బకాయిలు ఇప్పటికీ పూర్తిగా విడుదల కాలేదని విమర్శించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి, పౌష్టికాహారానికి ఈ పథకం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో: పాఠ్యపుస్తకాల లీక్‌పై వెంటనే విచారణ జరిపించాలి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి గరికపాటి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్. షాబీర్ భాష, సహాయ కార్యదర్శి ఎస్. శరత్ కుమార్, నాయకులు రంగస్వామి, ఈరేష్, నగర కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :