DNB News - ఆంధ్రప్రదేశ్ / : దేశ రాజధాని ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జాతీయ బీసీ మోర్చా సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి, ఆదోని ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి పాల్గొన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన బీసీ మోర్చా నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో బీసీ వర్గాల అభ్యున్నతి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కృష్ణ కౌర్, కర్ణాటక ఉడిపి ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ, ఢిల్లీ ఎమ్మెల్యే గజేందర్ యాదవ్, ఉత్తరప్రదేశ్ పార్లమెంట్ సభ్యుడు సంఘంలాల్, బీహార్ మంత్రి నిఖిల్ ఆనంద్‌తో పాటు పలువురు జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. పీవీ పార్థసారథి వాల్మీకి మాట్లాడుతూ, బీసీ వర్గాల సాధికారతకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. బీజేపీ బీసీ మోర్చా ద్వారా సమాజంలోని వెనుకబడిన వర్గాలకు మరింత చేరువై వారి అభివృద్ధికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.
Admin
DNB News